Wednesday, 30 July 2014
ఒంటె
ఒంటె ఒకటి తోటలోకి
ఒంటరిగా పోయెను
ఒకటి ఒకటి చెరుకులన్ని
ఒడిసి నమలు చుండగా
తోటమాలి ఒకడు చూసి
ఒక్క దెబ్బ వేసెను
రంగులు వేయండి :
Tuesday, 29 July 2014
Monday, 21 July 2014
Saturday, 19 July 2014
Tuesday, 15 July 2014
Monday, 14 July 2014
Friday, 11 July 2014
ఈత
" ఈ " అక్షరాన్ని సున్నా చుట్టి గుర్తించండి :
ఈత ఈక ఈల ఈగ
" ఈ " అక్షరాన్ని రాయండి :
_________________________________________________________________________
_________________________________________________________________________
*******
Tuesday, 8 July 2014
ఇల్లు
ఇటుక ఇటుక పేర్చాలి ,
ఇల్లు చక్కగ కట్టాలి ,
ఇద్దరు పిల్లలే ఉండాలి ,
ఇల్లు కళకళలాడాలి .
ఇల్లు చక్కగ కట్టాలి ,
ఇద్దరు పిల్లలే ఉండాలి ,
ఇల్లు కళకళలాడాలి .
" ఇ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
ఇల్లు ఇటుక ఇది ఇక్కడ
" ఇ " అక్షరాన్ని రాయండి :
_______________________________________________________________________________
________________________________________________________________________________
*******
Monday, 7 July 2014
Friday, 4 July 2014
అమ్మ
అమ్మ ఒడిలో ఉంటాను ,
అన్నం వదలక తింటాను .
అన్న ఒడిలో ఉంటాను ,
అన్నీ చదువుకుంటాను .
అక్క ఒడిలో ఉంటాను ,
అల్లరి మాని వింటాను .
నాన్న ఒడిలో ఉంటాను ,
రంగులు వేయండి :
" అ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
అమ్మ అక్క అన్న అత్త
" అ " అక్షరాన్ని రాయండి :
________________________________
________________________________________________________________
******
నా బ్లాగు గూర్చిన వివరణ
నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయినిని .
నాకు ఒకటవ తరగతి పిల్లలకు బోధించడమంటే చాలా ఇష్టం .
వారితో సమంగా అల్లరి చేస్తూ , ఆడుతూ ,
పాడుతూ బోధిస్తుంటాను .
పాడుతూ బోధిస్తుంటాను .
నేను పది సంవత్సరాల క్రితం ఒకటవ తరగతి పిల్లల కొరకు
వారి స్థాయికి తగిన విధంగా ఒక పుస్తకాన్ని రచించాను .
ఇప్పుడు ఈ బ్లాగు ద్వారా మీ అందరి ముందు
ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను . నాలాంటి ఉపాధ్యాయులు ,
చిన్న పిల్లల తల్లిదండ్రులు , నా బ్లాగ్మిత్రులు ఈ పనిలో
నన్ను ప్రోత్సాహిస్తారని , నా ప్రయత్నం మరింత
మెరుగయే విధంగా సలహాలు , సూచనలు
ఇస్తారని ఆశిస్తూ...............గాజుల శ్రీదేవి .
***********
Subscribe to:
Posts (Atom)