Sunday, 7 December 2014
Friday, 5 December 2014
చందమామ
చందమామ చందమామ
చల్లనైన మామ
అందరికి నీవు అందమైన మామ
అందుకోను చేయి చాస్తే
అందవే మామ
అందనంత దూరం
ఎందుకున్నావు మామ
అందమైన కలలో
నన్ను ఎత్తుకోవా మామ
చందమామ చందమామ
చల్లనైన మామ
అందరికి నీవు అందమైన మామ
గద దయ దండ
" ద " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
గద దయ దండ
దసరా చందనం
" ద " అక్షరాన్ని రాయండి :
__________________________________
__________________________________
***********
ఒకటవ తరగతి
తరగతి తరగతి
అందమైన తరగతి
అందమైన తరగతి
ఆటలు ఆడే తరగతి
పాటలు పాడే తరగతి
పాటలు పాడే తరగతి
కథలు చెప్పే తరగతి
బొమ్మలు వేసే తరగతి
బొమ్మలు వేసే తరగతి
తరగతి తరగతి
అందమైన తరగతి
మా ఒకటవ తరగతి
అందమైన తరగతి
మా ఒకటవ తరగతి
Wednesday, 5 November 2014
బాణం
బాణం తగిలిన పావురము
ప్రాణం విలవిల లాడింది
అరుణ చూచి లేచింది
బాణం మెల్లగ తీసింది
గాయం కడిగి తుడిచింది
భరిణలో మందు పూసింది
రంగులు వేయండి :
" ణ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
వీణ రణం గుణం
గణగణ కణకణ కంకణం
" ణ " అక్షరాన్ని రాయండి :
____________________________________
____________________________________
************
Tuesday, 28 October 2014
Wednesday, 15 October 2014
ఏడవకు ఏడవకు నా చిట్టిచెల్లి
ఏడవకు ఏడవకు నా చిట్టిచెల్లి
కడవతో అమ్మ నీళ్ళు తెస్తోంది
చెట్టు నీడలోన మంచమేసింది
కాడమల్లెపూలు దండ గుచ్చమంది
కొండ మీద దేవునికి ఇచ్చి రమ్మంది
ఏడవకు ఏడవకు నా చిట్టిచెల్లి
ఏడవకు ఏడవకు నా చిట్టిచెల్లి
రంగులు వేయండి :
"డ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
పడవ పడగ నడక
కడప డమరు డబడబ
"డ" అక్షరాన్ని రాయండి :
_____________________________________
_____________________________________
********
Subscribe to:
Posts (Atom)












