గాజుల శ్రీదేవి
Wednesday, 4 February 2015
Friday, 9 January 2015
సాహిల్ పుట్టినరోజు
మీరజత్తా ! నన్ను నిదుర పెట్టి శీదేవాంటీ చూడు ఎలా దారంతా పూలు పరచిందో మీ అందరు నా పుట్టినరోజని వస్తారని..............
ఇంటి బయట చూసావా చక్కగా పూల మొక్కలు అందంగా పెంచింది..........
ఆత్తా! శీదేవాంటీ చూడు నా పుట్టినరోజని ఎలా చేసిందో...
లోపల నా రూంలో అయితే చూడు ఏం చేసిందో......
ఇంకా నాకు ఇంకొక మంచి గిఫ్ట్ ఉంచింది........
అందరం కలసి కేకు కట్ చేయాలంట.......
కేకు తిన్నాక ఆంటీ వాళ్ళ తోటలోకి వెళ్ళి ఆడుకోవాలంట ఇదిగో ఇదే.....
తోటలో జంతర్మంతర్ లో చాలాసేపు ఆడుకోవచ్చంట.........
అత్తా ! అందరిని చక్కగా చిలకల కొలనుకు తీసుకెళతాను........
అత్తా...నీతో చెబుతున్నానంతే.........నేనేమీ చూడలేదు
శీదేవాంటీ నాకు మంచి డ్రస్సు కొన్నది ....
ఇది మాత్రం చూసా.......
అందరూ తప్పక నా పుట్టిన రోజుకు విష్ చేస్తారుగా
ఎదురు చూస్తుంటాను మీరజత్తా.........సాహిల్
మా బుజ్జి సాహిల్ తో పాటు జనవరి పదవ తారీకున పుట్టినరోజు జరుపుకునే చిన్నారులందరికి జన్మదిన శుభాకాంక్షలు.
************
Tuesday, 16 December 2014
హంస
హంసలు వరుసగ ఈదుతు ఉంటే
ఆహ ఆహ మాకిష్టం
హరిణం గెంతుతు పరిగెడుతుంటే
ఆహ ఆహ మాకిష్టం
హరిచందనము వాసన అంటే
ఆహ ఆహ మాకిష్టం
హలముతో పొలమును దున్నటం అంటే
ఆహ ఆహ మాకిష్టం
సింహం దూకుతు వస్తూ ఉంటే
అమ్మో! అంటూ పరుగెడతాం
రంగులు వేయండి :
" హ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
ఊహ హంపి దాహం
అహం హరిదాసు సహనం
" హ " అక్షరాన్ని రాయండి :
_______________________________________
_______________________________________
********
అక్షరము
అక్షరములను దిద్దుకో
లక్షణముగా చదువుకో
విచక్షణను తెలుసుకో
క్షమాగుణం పెంచుకో
లక్షణముగా చదువుకో
విచక్షణను తెలుసుకో
క్షమాగుణం పెంచుకో
రంగులు వేయండి :
మీ ఇష్టమైన అక్షరాలను క్రేయాన్స్ తో రాయండి
_______________________________________
_______________________________________
" క్ష " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
కక్ష భిక్ష శిక్ష లక్ష
క్షణం పక్షం క్షవరం
" క్ష " అక్షరాన్ని రాయండి :
_________________________________________
_________________________________________
******
సంతోషం
సరిత ,సమత సంత కెళ్ళారు
సన్నబియ్యం,సగ్గుబియ్యం తీసుకొచ్చారు
సన్నబియ్యం,సగ్గుబియ్యం తీసుకొచ్చారు
పాయసం ,పులిహోర చేసుకున్నారు
సరస్సు వద్ద గుడికి పరుగు తీసారు
సరస్సు వద్ద గుడికి పరుగు తీసారు
సహపంక్తి భోజనంలో వడ్డించారు
సంతోషంగా తిరిగి వచ్చారు
సంతోషంగా తిరిగి వచ్చారు
రంగులు వేయండి :
" స " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
సగం సరదా దసరా
మసక సంచి సలసల
మసక సంచి సలసల
" స " అక్షరాన్ని రాయండి :
________________________________________
________________________________________
**********
Wednesday, 10 December 2014
Subscribe to:
Posts (Atom)