Tuesday, 16 December 2014

హంస




హంసలు వరుసగ ఈదుతు ఉంటే
  ఆహ ఆహ మాకిష్టం

హరిణం గెంతుతు పరిగెడుతుంటే
 ఆహ ఆహ మాకిష్టం

హరిచందనము వాసన అంటే
 ఆహ ఆహ మాకిష్టం

హలముతో పొలమును దున్నటం అంటే
 ఆహ ఆహ మాకిష్టం

 సింహం దూకుతు వస్తూ ఉంటే
అమ్మో! అంటూ పరుగెడతాం



రంగులు వేయండి :




" హ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :


ఊహ     హంపి     దాహం
అహం    హరిదాసు      సహనం
 
" హ " అక్షరాన్ని రాయండి :

_______________________________________
_______________________________________

********

అక్షరము


  అక్షరములను దిద్దుకో
లక్షణముగా చదువుకో
విచక్షణను తెలుసుకో
క్షమాగుణం పెంచుకో


రంగులు వేయండి :
మీ ఇష్టమైన అక్షరాలను క్రేయాన్స్ తో  రాయండి 

_______________________________________
_______________________________________


 

" క్ష " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :


కక్ష      భిక్ష      శిక్ష     లక్ష
క్షణం     పక్షం   
క్షవరం  
 
" క్ష " అక్షరాన్ని రాయండి :


_________________________________________
_________________________________________


******

కోవళం

  కళ నేను కేరళ వెళతాం
మళయాళమును నేర్చుకుంటాం
నారికేళం నీరు తాగి
కోవళం బీచ్ చూసి వస్తాం


రంగులు వేయండి :




" ళ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

తాళం       మేళం      గోళం
సరళం     విరాళం     శ్రీకాకుళం

" ళ " అక్షరాన్ని రాయండి :


________________________________________
________________________________________

*******

సంతోషం


 సరిత ,సమత సంత కెళ్ళారు
సన్నబియ్యం,సగ్గుబియ్యం తీసుకొచ్చారు
 
పాయసం ,పులిహోర చేసుకున్నారు
సరస్సు వద్ద గుడికి పరుగు తీసారు

సహపంక్తి భోజనంలో వడ్డించారు
సంతోషంగా తిరిగి వచ్చారు
 

రంగులు వేయండి :




" స " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :


సగం       సరదా       దసరా
మసక     సంచి         సలసల


 
" స " అక్షరాన్ని రాయండి :
________________________________________
________________________________________

**********

Wednesday, 10 December 2014

తెలుగుభాష

 తెలుగు వేషధారణ 
ఎంతో అందమైనది 

తెలుగుభాష పలుకు 
ఎంతో మధురమైనది 

తెలుగు వారి పౌరుషం 
ఎంతో ఘనమైనది 

రంగులు వేయండి :




" ష " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

మేషం                రోషం           దోషం 
విషం               శేషం               షరతు 

" ష " అక్షరాన్నిరాయండి :
 
______________________________________
______________________________________
 
**********

శంఖం

 శనివారం నాడు శలవు వచ్చింది 
శంకరుని గుడికి పోయివద్దామా 
శంఖం భంభం ఊదుకుందామా 
శనగలు బెల్లం కలిపి తిందామా 

రంగులు వేయండి :


" శ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 దశ             ఆశ            శపధం 
దిశ              శశి          ఆకాశం

" శ " అక్షరాన్నిరాయండి :
 ______________________________________
______________________________________

************

Tuesday, 9 December 2014

వదినమ్మ

వదినమ్మ వచ్చింది 
వడియాలు తెచ్చింది 
 
వడలు వేసి పెట్టింది 
వంకాయ వండింది 
 
వడివడిగా నడచింది 
వరిచేనుకు వెళ్ళింది 

రంగులు వేయండి : 



" వ  "అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
వల               వనం             వరం 
వర             వరుస          కలువ

" వ  " అక్షరాన్ని రాయండి :

________________________________________
________________________________________

*********

Monday, 8 December 2014

కొలను

 
కొలను గట్టున కూర్చున్నాం 
మిలమిల మెరిసే చేపలను చూసి 
చేతిలో గాలం విసిరాము 
చేపలనెన్నో పట్టేస్తాం 

రంగులు వేయండి :
 
" ల " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
లత             తల            వల                కల 
జలజల        విలవిల       కిలకిల          గిలగిల  

" ల " అక్షరాన్నిరాయండి :
 
________________________________________
________________________________________
 
*************

అందమైన బూరలు

 
అవిగో అవిగో బూరలు
అందమైన బూరలు
 
రంగురంగుల బూరలు
రకరకాల బూరలు
 
ఆదివారం మేము 
ఆడుకునే బూరలు 
 
రంగులు వేయండి  :
 
 
 
 "ర " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
రసం          రథం         రంపం 
కారం        వారం          దారం
 
 "ర " అక్షరాన్ని  రాయండి  :
 
_____________________________________
_____________________________________
 
 
**********

Sunday, 7 December 2014

యమున


గలగల యమున రావమ్మా
దయతో మమ్ము చూడమ్మా
 

కాయకష్టం చేసాము
నీటిపాయలు ఇవ్వమ్మా
 

కాయలు , ధాన్యం పండిస్తాం
జయముతో నీకు జేకొడతాం

 
రంగులు వేయండి :


" య " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

 యతి        యముడు       గాయం
మాయం          వంకాయ           యజమాని

 " య " అక్షరాన్ని రాయండి :

____________________________________
____________________________________
 

*********

మంచి పనులు


మసకవేళలో చదవకూడదు
మంచువేళలో తిరగకూడదు 

మంటతో ఆడకూడదు
 

మంచి పనులనెప్పుడు ఆపకూడదు
మంచి మాటలెపుడు మరువకూడదు


రంగులు వేయండి :


" మ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
మనం    మర         మంచం
మతం           మకరం         మందారం

" మ " అక్షరాన్ని రాయండి :

_____________________________________
_____________________________________
*************

భగత్ సింగ్

భలే భలే బొమ్మ ఇది
భగత్ సింగ్ బొమ్మ ఇది
భయం లేని వీరుడు

భరతమాత ముద్దు బిడ్డ
భక్తి తోడ పూజించు
భరతభూమిని ప్రేమించు

 
రంగులు వేయండి :



"భ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

భజన        భయం          భవనం 
భక్తి            భటుడు         భగభగ             


"భ " అక్షరాన్నిరాయండి :

 ____________________________________
_____________________________________

*****

బంతి



బంతంటే మాకిష్టం
బడిలో ఆటలు ఆడేస్తాం
 

బంకమట్టి మాకిష్టం
బండి బొమ్మలు చేసేస్తాం
 

బంతి పూలు మాకిష్టం
గబగబ దండలు కట్టేస్తాం


రంగులు వేయండి :

 
" బ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 బండ      బజారు      బరువు
బందరు   బంగారం


" బ " అక్షరాన్ని రాయండి :
________________________________
________________________________
 
********

 

ఫలము


ఫలములనిచ్చే మొక్కలు నాటు
ఫలములు పండే వరకు ఆగు
 

సఫలం అయిన పనిని చూడు
ఫలితం దక్కక మానదు ఎప్పుడూ


రంగులు వేయండి :


" ఫ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
ఫని          ఫకీరు        ఫలకం    ఫణి

" ఫ " అక్షరాన్ని రాయండి :
__________________________________
__________________________________
 
**********

 

పలక బలపం


పలక బలపం తీసుకుని
బడికి పరుగున పోదాము
 

పదము పదము చదివి
పలక మీద రాద్దాము
 

పంతులుగారికి చూపి
పదరా ఇంటికి పోదాము


రంగులు వేయండి :

" ప " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
పనస          పడవ         పంట
కలప           గడప         పలుకు


" ప " అక్షరాన్ని రాయండి :
________________________________
________________________________
 
**********
 

నల్లని కాకమ్మ


నల్ల నల్లని కాకమ్మ
కొమ్మ పైన కూర్చుంది
 

నల్లని మబ్బును చూసింది
రివ్వున ఎగిరి పోయింది
 

గూటిలోన దూరింది
హాయిగ వానను చూసింది
 
రంగులు వేయండి :


 

" న " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
నగ          నస         కూన
నటన     నలక      నడక
 

" న " అక్షరాన్ని రాయండి :
______________________________
______________________________
 

******
 

ధనస్సు

 
గురువు బోధను విన్నాడు
 రాము
డు ధనస్సు తీసాడు
ధగధగ మెరిసిపోతోంది
ధనధన విరచి వేసాడు
 
రంగులు వేయండి :

" ధ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
 
ధర         బాధ         వ్యధ
ధరణి     సాధన         ధనం       
 
" ధ " అక్షరాన్ని రాయండి :

_______________________________________
_______________________________________
 
********

 

Friday, 5 December 2014

చందమామ


చందమామ  చందమామ 
చల్లనైన మామ 
అందరికి నీవు అందమైన మామ

అందుకోను చేయి చాస్తే 
అందవే మామ 

అందనంత దూరం 
ఎందుకున్నావు మామ

అందమైన కలలో 
నన్ను ఎత్తుకోవా మామ 

చందమామ  చందమామ 
చల్లనైన మామ
అందరికి నీవు అందమైన మామ  


రంగులు వేయండి :



" ద  " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

గద            దయ          దండ 
దసరా        చందనం

 " ద " అక్షరాన్ని రాయండి :

__________________________________
__________________________________

***********



రథం


అదిగో అదిగో రథమదిగో  
కథలో విన్న రథమదిగో 
దేవుడు ఎక్కే రథమదిగో 
అందరు లాగే రథమదిగో 

రంగులు వేయండి :



" థ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

రథం           పథకం         కథనం

" థ " అక్షరాన్ని రాయండి :

__________________________________
__________________________________

***********



ఒకటవ తరగతి

తరగతి  తరగతి
అందమైన  తరగతి
 
ఆటలు ఆడే  తరగతి
పాటలు పాడే  తరగతి
 
కథలు చెప్పే  తరగతి
బొమ్మలు వేసే  తరగతి
  
తరగతి  తరగతి
అందమైన  తరగతి
మా ఒకటవ  తరగతి
 
రంగులు వేయండి :
 


 "త  " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

తాత             సీత             పీత                  తల            
తడి              కూత           మేత                కోత 
 
"త  " అక్షరాన్ని  రాయండి :

_________________________________
_________________________________

 
***********