Wednesday, 30 July 2014

ఓహో


 ఓరిమితో ఉండాలి
ఓనమాలు నేర్వాలి
ఓడిపోక గెలవాలి
 

అందరు ఓహో అనాలి


రంగులు వేయండి :


" ఓ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :
ఓడ         ఓటు          ఓపిక
ఓటమి      ఓరగా      ఓంకారము 
 " ఓ " అక్షరాన్ని రాయండి :

______________________________________
______________________________________


***********

ఒంటె


ఒంటె ఒకటి తోటలోకి
ఒంటరిగా పోయెను
ఒకటి ఒకటి చెరుకులన్ని
ఒడిసి నమలు చుండగా
తోటమాలి ఒకడు చూసి
ఒక్క దెబ్బ వేసెను


రంగులు వేయండి :


 


" ఒ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి  :

ఒర            ఒడి          ఒడలు          
ఒడుపు         ఒదుగు       ఒంటె        



 "   ఒ " అక్షరాన్ని  రాయండి :

________________________________________
________________________________________




******

Tuesday, 29 July 2014

ఐస్ క్రీమ్


 ఐదుగురం మేమంతా
ఐకమత్యంగా ఉంటాము
ఐనంపూడి మా ఊరు
ఐస్ క్రీమ్  తింటూ వెళతాము 


రంగులు వేయండి :


 


" ఐ" అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి  :


ఐదు           ఐనా         ఐలూరు          
ఐరావతం     ఐస్ క్రీమ్        



 " ఐ  " అక్షరాన్ని  రాయండి :

________________________________________
________________________________________




******

Monday, 21 July 2014

ఏనుగు డ్రస్సు

ఏడ్చి ఏడ్చి పాపాయి
ఏ ఊరు వెళుతోంది ?
ఏనుగు డ్రస్సు వేసుకుని
ఏలూరు వెళుతోంది .

 రంగులు వేయండి :



"ఏ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి  :

  ఏది         ఏరు       ఏకు 
ఏతం       ఏడుపు       ఏమిటి 


" ఏ " అక్షరాన్ని  రాయండి :

________________________________________
________________________________________




******
















******

Tuesday, 15 July 2014

ఊయల


 అదిగో అదిగో ఊడలమర్రి
మా ఊరిలోని ఊడలమర్రి
ఊడలు పట్టుకు ఊగెదము
ఊయల ఆటలు ఆడెదము


రంగులు వేయండి :

 


" ఊ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

  
ఊడ        ఊక        ఊట         ఊరు        ఊయల
" ఊ " అక్షరాన్ని రాయండి :
______________________________________
______________________________________
************ 

Monday, 14 July 2014

ఉడత

ఉల్లిపాయ కూర తిన్నా
ఉడత పిల్లతో ఆడుకున్నా
ఉరుము మెరుపు చూడగానే
ఉన్ని దుప్పటి కప్పుకున్నా
   
రంగులు వేయండి :




 " ఉ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

ఉమ        ఉష         ఉలి        ఉలవ         ఉగాది


 " ఉ " అక్షరాన్ని రాయండి :
_____________________________________
_____________________________________

***********

Friday, 11 July 2014

ఈత


ఈత రాక మేమంతా ,
ఈవల ఒడ్డున ఉన్నాము .
రంగురంగుల ఈకల బాతులు ,
ఈదుకుంటూ పోయాయి .


రంగులు వేయండి :-

 
 
" ఈ " అక్షరాన్ని  సున్నా చుట్టి గుర్తించండి :

ఈత         ఈక           ఈల            ఈగ
 
 
" ఈ " అక్షరాన్ని  రాయండి :

_________________________________________________________________________
_________________________________________________________________________
 
 
 
*******

Tuesday, 8 July 2014

ఇల్లు

ఇటుక ఇటుక పేర్చాలి ,
ఇల్లు చక్కగ కట్టాలి ,
ఇద్దరు పిల్లలే ఉండాలి ,
ఇల్లు కళకళలాడాలి .
  
 రంగులు  వేయండి :


" ఇ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :

ఇల్లు           ఇటుక         ఇది          ఇక్కడ


" ఇ " అక్షరాన్ని  రాయండి :

 _______________________________________________________________________________

________________________________________________________________________________

*******

Monday, 7 July 2014

ఆట


ఆడే పాడే పిల్లలు ,
ఆకుకూరలు తినాలి .
ఆరోగ్యంగా పెరగాలి ,
అ ఆ ఇ ఈ దిద్దాలి .



రంగులు వేయండి :





" ఆ " అక్షరాన్ని సున్నా చుట్టండి :


ఆట          ఆకు         ఆశ          ఆవ



" ఆ " అక్షరాన్ని రాయండి :



____________________________________
__________________________________________________________________________


 
*****

Friday, 4 July 2014

అమ్మ


 
అమ్మ ఒడిలో ఉంటాను ,
అన్నం వదలక తింటాను .
 

అన్న ఒడిలో ఉంటాను ,
అన్నీ చదువుకుంటాను .
 

అక్క ఒడిలో ఉంటాను ,
అల్లరి మాని వింటాను .

                             
                           నాన్న ఒడిలో ఉంటాను ,
అన్నీ నేర్చుకుంటాను .


రంగులు వేయండి :   

 

" అ " అక్షరాన్ని గుర్తించి సున్నా చుట్టండి :


అమ్మ         అక్క              అన్న           అత్త         



" అ " అక్షరాన్ని రాయండి :

________________________________
________________________________________________________________


******

నా బ్లాగు గూర్చిన వివరణ


నేను వృత్తిరీత్యా ఉపాధ్యాయినిని . 
నాకు ఒకటవ తరగతి పిల్లలకు బోధించడమంటే చాలా ఇష్టం . 
వారితో సమంగా అల్లరి చేస్తూ , ఆడుతూ , 
పాడుతూ  బోధిస్తుంటాను . 
నేను పది సంవత్సరాల క్రితం ఒకటవ తరగతి పిల్లల కొరకు 
వారి స్థాయికి తగిన విధంగా ఒక పుస్తకాన్ని రచించాను . 
ఇప్పుడు ఈ బ్లాగు ద్వారా మీ అందరి ముందు 
ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను . నాలాంటి ఉపాధ్యాయులు , 
చిన్న పిల్లల తల్లిదండ్రులు , నా బ్లాగ్మిత్రులు ఈ పనిలో 
నన్ను ప్రోత్సాహిస్తారని , నా ప్రయత్నం మరింత 
మెరుగయే విధంగా సలహాలు , సూచనలు 
ఇస్తారని ఆశిస్తూ...............గాజుల శ్రీదేవి .

***********