Wednesday, 4 February 2015

పచ్చని చిలకమ్మా......

 పచ్చని  చిలకమ్మా
మా తోటకు  రావమ్మా
చక్కగ  పండిన మామిడిపళ్ళు
కొరికి  తినవమ్మా

పచ్చని  చిలకమ్మా
మా  పెరటికి  రావమ్మా
దోరగ  పండిన జామపళ్ళు
ఎన్నో కలవమ్మా

పచ్చని  చిలకమ్మా
మా  ఇంటికి  రావమ్మా
 మా  చిన్ని బాబుకు తీయని మాటలు
నేర్పి పోవమ్మా

**********